- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విజయ్ CM అవుతారని 2013లోనే చెప్పారు’: ఆ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన విలన్!
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్ రాజకీయ ప్రస్థానంపై ప్రముఖ బెంగాలీ నటుడు తోట రాయ్ చౌదరి చేసిన పాత వ్యాఖ్యలు, ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ ‘భవిష్యత్ ముఖ్యమంత్రి’ అవుతారని 2013లోనే వ్యక్తమైందని, అది ఇప్పుడు అక్షరాలా నిజమైందని ఆయన వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా కత్తి. ఇది 2014లో విడుదలైంది. ఈ సినిమాలో నటుడు తోట రాయ్ చౌదరి విలన్‌గా నటించారు. అయితే, తాజాగా కత్తి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆయన వెల్లడించారు.
2013 నాటి సంఘటన..
‘అది 2013వ సంవత్సరం. కత్తి సినిమా షూటింగ్ కోల్‌కతాలో జరుగుతోంది. ఆ సమయంలో నా అసిస్టెంట్ ఒకరు అక్కడే ఉన్నారు. ఆయనకు జ్యోతిష్యం, ముఖ లక్షణాలను బట్టి మనుషుల భవిష్యత్తును అంచనా వేయడం వచ్చు. షూటింగ్ స్పాట్‌లో విజయ్‌ని చూసిన నా అసిస్టెంట్.. విజయ్ నడుచుకుంటూ వెళ్తున్న తీరును, ఆయన ముఖ వర్చస్సును నిశితంగా గమనించాడు. విజయ్ వెళ్లిపోయిన తర్వాత నా అసిస్టెంట్ దగ్గరకు వచ్చి.. భవిష్యత్‌లో ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు సార్ అని చెప్పారు. ఆయన నడకలో, వ్యక్తిత్వంలో గొప్ప పాలకుడి లక్షణాలు కనిపిస్తున్నాయి సార్ అని చెప్పారు. ఆ తర్వాతి కాలంలో విజయ్ రాజకీయాల్లో రావడం. పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించడం, ముఖ్యమంత్రి కావడం అన్నీ జరిగిపోయాయి’ అని తోట రాయ్ చౌదరి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






