- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరుప్పు కోసం అన్ని కోట్ల పారితోషికం పుచ్చుకున్న త్రిష.. ఇది మామూలు రికార్డు కాదు
కరుప్పు సినిమా కోసం త్రిష ఏకంగా 10 నుంచి 12 కోట్ల వరకు పారితోషకాన్ని పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లతో పోలిస్తే సీనియర్ హీరోయిన్లకు కాస్త తక్కువ పారితోషకం అందుతూ ఉంటుంది. అందుకు ప్రధాన కారణం సీనియర్లు అయ్యే కొద్దీ వారి క్రేజ్ తగ్గడం వల్ల వారికి పారితోషకాలు కూడా తక్కువగా ఇస్తారు. కానీ కొంతమంది మాత్రం ఎంత సీనియర్ అయినా కూడా అద్భుతమైన క్రేజ్‌ను మెయింటైన్ చేస్తూ భారీ ఎత్తున పారితోషకాన్ని అందుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో త్రిష ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా, ఇప్పటికీ కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గానే కెరీర్‌ను కొనసాగిస్తోంది. అలాగే తెలుగులో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ‘కరుప్పు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమా కోసం ఈమె ఏకంగా 10 నుంచి 12 కోట్ల వరకు పారితోషకాన్ని పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రిష వయస్సు 44 సంవత్సరాలు. ఈ ఏజ్‌లో కూడా ఈమె ఎంతో అందంగా కనిపించడం, అలాగే అద్భుతమైన నటనను ప్రదర్శించడం వల్ల ఈ ముద్దుగుమ్మకు సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. దాంతో పెద్ద మొత్తంలో పారితోషకం ఇచ్చి మరీ ఈమెను హీరోయిన్‌గా చిత్రాల్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ‘కరుప్పు’ చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దాంతో ఈరోజు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. త్రిష ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.






