ఇండియా-పాక్ వార్.. నకిలీ వార్తలపై ఈ నెంబర్‌కి ఫిర్యాదు చేయండి!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-09 16:39:53  IST  )

ప్రస్తుతం భారత్–పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

ఇండియా-పాక్ వార్.. నకిలీ వార్తలపై ఈ నెంబర్‌కి ఫిర్యాదు చేయండి!
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం భారత్–పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో ప్రజల భద్రత దృష్ట్యా బ్లాక్ అవుట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది.

ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో సైబర్ ఎటాక్ జరిగే ఛాన్స్ ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే PIB ఫ్యాక్ట్ చెక్‌కు చేరవేయాలని ప్రభుత్వం పౌరులను కోరింది. దీని కోసం +918799711259 నంబర్‌కు వాట్సాప్ ద్వారా, [email protected] వెబ్‌సైట్ ద్వారా అధికారులను అప్రమత్తం చేయోచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండండి అని సూచించారు. తప్పుడు సమాచారానికి బలికాకండని కోరారు. సోర్స్‌ని ధ్రువీకరించుకుంటూ మీ డేటాను రక్షించుకోండి అని పేర్కొంది.

Read Also..ఇండియా–పాక్ ఉద్రిక్తతలు.. ఆ ఒప్పందం ప్రకారం ఆసుపత్రుల పై ప్రత్యేక గుర్తులు!?

Next Story