- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. బంగ్లాదేశ్‍లో హిందూ మహిళపై అత్యాచారం.. వీడియో తీసి..
బంగ్లాదేశ్ లో హిందూ మహిళపై అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్‍లో హిందూ మైనారిటీలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు హిందువులను కొట్టి చంపిన ఉదంతాలు మరువక ముందే తాజాగా ఓ హిందూ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘోరం వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం బంగ్లాదేశ్‍లోని జ్హెనైదా జిల్లా కలిగంజ్ ప్రాంతంలో 40 ఏళ్ల హిందూ వితంతు మహిళపై ఇద్దరు స్థానికులు శనివారం అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను చెట్టుకు కట్టేసి, జుట్టును కత్తిరించి, తీవ్రంగా హింసించారు. ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
చెట్టుకు కట్టేసి దారుణం:
మీడియాలో వెలువడిన కథనాల ప్రకారం.. బాధితురాలు కాలిగంజ్ మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 7లో షాహిన్, అతని సోదరుడి నుంచి కొంత భూమిని, ఇంటిని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు తర్వాత షాహిన్ ఆమెకు అసభ్యకరమైన ప్రతిపాదనలు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అతడి వేధింపులను మౌనంగా భరిస్తూ అతడి ప్రతిపాదనను నిరాకరించానని అయితే గత శనివారం సాయంత్రం తన ఇంటికి ఇద్దరు బంధువులు వచ్చిన సమయంలో షాహిన్ అతడి సహచరుడు హసన్ ఇంట్లోకి ప్రవేశించి తనపై అత్యాచారానికి ఒడిగట్టారని పేర్కొంది. ఆ తర్వాత ఆమె నుంచి రూ. 37 వేలు డిమాండ్ చేశారని డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె బంధువులను దాడి చేసి తరిమికొట్టారని ఫిర్యాదు చేసింది. వారి చర్యలతో కేకలు వేయడంతో తనను చెట్టుకు కట్టేసి ఆమె జుట్టును కత్తిరించి చిత్రహింసలకు గురి చేశారని పేర్కొంది. ఈ ఘటనలో స్పృహకోల్పోయిన బాధితురాలిని స్థానికులు రక్షించి జునైదా సదర్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా ఆమెపై దాడి చేసిన దురాగతానంతటిని నిందితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.






