- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్లో ఆగని హింస.. మరో హిందువు దారుణ హత్య
బంగ్లాదేశ్‌లో మైనారిటీగా ఉన్న హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు దాడుల్లో నలుగురు మరణించగా తాజాగా మరో వ్యక్తి కన్నుమూశాడు.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో మైనారిటీగా ఉన్న హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు దాడుల్లో నలుగురు మరణించగా తాజాగా మరో వ్యక్తి కన్నుమూశాడు. బంగ్లాదేశ్‌లోని జెస్సోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాణా ప్రతాప్ అనే హిందూ జర్నలిస్టును అల్లరి మూకలు కాల్చి చంపాయి. రాణా ప్రతాప్ ఓ వార్తాపత్రికలో ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. అంతే కాకుండా కోపాలియా బజార్‌లో అతడికి ఓ ఐస్ ఫ్యాక్టరీ కూడా ఉంది. సోమవారం ఫ్యాక్టరీ వద్దకు బైక్ పై వచ్చిన దుండగులు అతడిని బయటకు పిలిచి పక్కకు తీసుకెళ్లి తుపాకీతో కాల్చిచంపేశారు. అయితే రానా ప్రతాప్ కు తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయనపై అనేక కేసులు కూడా నమోదైనట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రానా ప్రతాప్ హత్యతో బంగ్లాదేశ్ లో హత్య చేయబడ్డ హిందువుల సంఖ్య ఐదుకు చేరింది. మరో మహిళపై అత్యాచారం కూడా జరిగింది. మైనారిటీలపై దాడుల నేపథ్యంలో అక్కడి యూనుస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మైనారిటీలను యూనుస్ తీరును పలువురు ఖండిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం ఇలాంటి ఘోరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






