రాఖీ పండుగ స్పెషల్.. ఆ రాష్ట్రంలోని మహిళలు భర్తలకు రాఖీ కట్టి.. ఆ తర్వాత!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-07 07:34:19  IST  )

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ.

రాఖీ పండుగ స్పెషల్.. ఆ రాష్ట్రంలోని మహిళలు  భర్తలకు రాఖీ కట్టి.. ఆ తర్వాత!?
X

దిశ,వెబ్‌డెస్క్: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఇది కూడా ఒకటి. ఈ పండుగను శ్రావణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్లు ఎంతో సంతోషంగా జరుపుకునే రాఖీ పండుగ ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన వచ్చింది. శనివారం రోజున ఈ రక్షాబంధన్ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి రోజు మంచి ముహూర్త సమయంలో తమ సోదరులకు అక్కా, చెల్లెళ్లు రాఖీలు కడుతారు.

రాఖీ కట్టిన తర్వాత వారికి సోదరులు బహుమతులు ఇస్తారు. అయితే కేవలం సోదరులకే కాదు భర్తలకు రాఖీ కట్టే ఆచారం ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. రక్షాబంధన్ సంప్రదాయం మధ్యప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో భిన్నంగా ఉంది. శతాబ్దాలుగా అక్కడి మహిళలు సోదరులకు కాకుండా భర్తలకు, చెట్లకు రాఖీ కట్టడం అనవాయితీగా వస్తోంది. చింద్వాడ జిల్లాలోని గోండు గిరిజనులు సమాజంలో భర్త మాత్రమే జీవితాంతం పక్కనే ఉండి రక్షిస్తాడని నమ్ముతారు.

అలాగే, రక్షాబంధన్ రోజున పొలాల్లో పూజలు చేసి పంటలకు, అడవుల్లోని చెట్లకు కూడా రాఖీ కడుతారు. అంతేకాదు.. ఇక్కడి గిరిజనులు దేవ్ రాఖీలను సొంతంగా తయారు చేస్తారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని చింద్వాడా సహా పలు ప్రాంతాల్లో ఇదే ఆచారాన్ని పాటిస్తున్నట్లు సమాచారం. ఇంద్రుడికి భార్య ఇంద్రాణి రాఖీ కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ‘‘పెళ్లంటే బాధ్యత.. భార్యకు ఒక రక్షకుడిగా తోడుగా ఉంటానంటూ భర్త చేసే ప్రతిజ్ఞ’’ అని గుర్తు చేస్తూ ఇక్కడి మహిళలు భర్తలకు రాఖీ కడుతుంటారు. ఈ క్రమంలో రాఖీ కట్టిన తర్వాత భర్త తన భార్యకు బహుమతులు ఇస్తారు. ఆ తర్వాత ఆ రోజున భార్యాభర్తలు కలిసి భోజనం చేస్తారు. ఈ వింత ఆచారానికి సంబంధిచిన న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story