‘రాఖీ’ ఏ సమయంలో కట్టాలి.. పండితులు ఏం చెబుతున్నారంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-06 07:22:33  IST  )

రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా చెప్పుకునే పండుగ రాఖీ

‘రాఖీ’ ఏ సమయంలో కట్టాలి.. పండితులు ఏం చెబుతున్నారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా చెప్పుకునే పండుగ రాఖీ. ఈ పండుగను శ్రావణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లకు, అక్కాతమ్ముళ్ల కు ఎంతో ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు. చెల్లి తన అన్న కోసం రాఖీ, స్వీట్ తెచ్చి ఎంతో ప్రేమతో రాఖీ కడుతుంది.

ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో రాఖీ పండుగ రాబోతుండడంతో అక్క, చెల్లెల్లు వారి సోదరుల కోసం మంచి రాఖీలు కొనుగోలు చేయాలనే పనిలో మునిగిపోయారు. తమ తమ్ముడి చేతికి అందమైన రాఖీ కట్టి ఎంతో మురిసిపోతుంది అక్క. రాఖీ కట్టుకున్న తమ్ముడు తమ స్నేహితులతో ఆ ఆనందాన్ని పంచుకుంటారు. అయితే.. ఎప్పుడైన రాఖీ పండుగ విషయంలో ప్రజలకు ఒక చిన్న సందేహం ఉంటుంది.

రక్షాబంధన్ రోజున మంచి సమయంలో రాఖీ కట్టాలి. ఈ తరుణంలో పండితుల దగ్గరకు వెళ్లి మంచి సమయం గురించి తెలుసుకొని ఆ సమయంలోనే తమ తమ్ముడికి లేదా అన్న చేతులకు రాఖీలు కడతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది(2025) ఈ నెల(ఆగస్టు) 9వ తేదీన రాఖీ పౌర్ణమి వచ్చింది. అయితే, శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్టు 8న రాత్రి 8:00 గంటల తర్వాత ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం 1:24 గంటల వరకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు.

ఈ క్రమంలో రాఖీ పండుగ రోజున(శనివారం) ఉదయం 5:56 నుంచి మధ్యాహ్నం 1:24 గంటల లోపు రాఖీ కట్టేందుకు శుభసమయం అని తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 గంటల వరకు అభిజిత్ ముహూర్తం ఉందని, ఇది చాలా మంచిదని చెబుతున్నారు. రాత్రి 7:19 నుంచి 9:24 గంటల వరకు కట్టవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాఖీ కట్టే ముందు సోదరుడి నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత రాఖీని కట్టడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. అలాగే, రాఖీ కట్టేటప్పుడు సోదరుడికి ఎదురుగా కూర్చొని కట్టడం శుభప్రదంగా భావిస్తారు.

Next Story