- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు సీఎంగా రజనీకాంత్.. సంక్షోభం వేళ సంచలనం!
తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్! విజయ్‌ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ఖతర్నాక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఫలితాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పొత్తలు, కూటములపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన సినీ నటుడు విజయ్ కు చెందిన టీవీకే.. మ్యాజిక్ ఫిగర్ కోసం మద్దతు కూడగట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో వేళ్లూనుకుపోయిన డీఎంకే, అన్నా డీఎంకేను కాదని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విజయ్‍కు ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలో సాగుతున్న నంబర్ గేమ్ పాలిటిక్స్ దెబ్బకు అంతిమంగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోయేది ఎవరు? అనే చర్చ రకరకాల అనుమానాలకు తావిస్తోంది. ఇటువంటి తరుణంలో ఎవ్వరూ ఊహించని వ్యక్తి తమిళ రాజకీయాలను శాసించబోతున్నారనే చర్చ ప్రస్తుతం హాట్‍హాట్‍గా మారింది.
సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్!:
తమిళనాడుకు నెక్స్ట్ సీఎం సూపర్ స్టార్ రజనీకాంత్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. తమను దెబ్బ తీసిన విజయ్‍పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇటు డీఎంకే, అటు అన్నా డీఎంకే రెండూ కలిసి రజనీకాంత్ పేరును తెరపైకి తీసుకువస్తున్నారని, ఈ మేరకు ఈక్వేషన్లపై ఇరు పార్టీలలో జోరుగా చర్చ కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తర్వాత మాజీ ఎం.కే స్టాలిన్ నివాసానికి రజనీకాంత్ వెళ్లడం పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చగా మారింది. గెలుపొందిన పార్టీ వైపు కాకుండా ఓడిపోయిన పార్టీ అధినేత వద్దకు సూపర్ స్టార్ వెళ్లడం వెనుక మతలబు ఏంటి అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మొన్న స్టాలిన్ ఇంటికి రజనీకాంత్ వెళ్ళగా నిన్న రజనీకాంత్ ఇంటికి డిఎంకే సీనియర్ నేత వేలు వెళ్ళారు. దీంతో తమిళనాట సమీకరణాలు వేగంగా మారుతున్నాయని డీఎంకే సపోర్ట్ తో రజనీకాంత్‍ను ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది.
చక్రం తిప్పుతున్న మాజీ సీఎం:
ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన విజయ్ ఫలితాల తర్వాత జరుగుతున్న పరిణామాలను తన కంట్రోల్‍లోకి తెచ్చుకోవడంలో విఫలం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. విజయ్ కు కాంగ్రెస్ మద్దతు తెలిపినా వీసీకే, లెఫ్ట్ వంటి పార్టీలు ఇంకా తచ్చాడుతూనే ఉన్నాయి. విజయ్ కాంగ్రెస్ తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహించిన స్టాలిన్ వ్యూహత్మకంగా సీఎం అభ్యర్థిగా రజనీకాంత్‍ను తెరపైకి తీసుకువస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీఎంకే, అన్నా డీఎంకే సీఎం పోస్టు తీసుకుంటే అది భవిష్యత్‍లో తమకు సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలకు తోడుగా అన్నా డీఎంకే కలిసి వస్తే రజనీకాంత్‍ను ముందు పెట్టి రాజకీయం సాగించేలా స్టాలిన్ రహస్యంగా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ సీఎం అయితే రాష్ట్రంలో అల్లర్లు ఉండవని అంచనా ఈ క్రమంలో అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామిని స్పీకర్‍గా ఎన్నుకోబోకున్నారనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాల వేళ ఇవాళ డీఎంకే, అన్నా డీఎంకే నేతలు మరోసారి రజనీకాంత్ తో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. గంట గంటకు మారుతున్న తమిళ రాజకీయాల్లో ఆఖరి పంచ్ ఎవరిదో అనేది ఉత్కంఠగా మారింది.






