లోక్‌సభలో రాహుల్ గాంధీ అసభ్యకర ప్రవర్తన.. బయటకు వెళ్తూ ఏం చేశాడో తెలుసా?

by Disha Web Desk 12 |
లోక్‌సభలో రాహుల్ గాంధీ అసభ్యకర ప్రవర్తన.. బయటకు వెళ్తూ ఏం చేశాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పై మాట్లాడని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. పార్లమెంట్ సభ సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోయాడు. రాజస్థాన్ లో మీటింగ్ లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ వెళుతూ.. ఫ్లయింగ్ కిస్ చేస్తూ వెళ్లిపోయాడు. దీంతో రాహుల్ గాంధీ అసభ్యకరంగా ప్రవర్తించాడని.. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి రాహుల్ గాంధీ ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నేను ఏదో ఒకదానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. నా ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన వ్యక్తి వెళ్లే ముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళా సభ్యులు కూర్చున్న పార్లమెంటుకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం అంటే అతను ముమ్మాటికీ స్త్రీ ద్వేషపూరిత వ్యక్తి మాత్రమే అలా చేయగలడు. ఇలాంటి అసభ్య ప్రవర్తన దేశంలోని పార్లమెంట్‌లో మునుపెన్నడూ చూడలేదని స్మృతి ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు.

Read More..

Rahul Gandhi : తీవ్రమైన వ్యాఖ్యలు చేసి పార్లమెంట్ నుంచి వెళ్లిపోయిన రాహుల్



Next Story

Most Viewed