Gulf War Effect: ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఖతార్

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-02 14:53:35  IST  )

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తోంది.

Gulf War Effect: ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఖతార్
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ(Gulf War) వాతావరణం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తోంది. ప్రధానంగా చమురు మరియు సహజ వాయువు ఉత్పత్తి కేంద్రాలపై జరిగిన దాడులతో గ్యాస్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది.

ఖతార్ ఎనర్జీ సంచలన నిర్ణయం:

ఖతార్‌లోని రాస్ లఫాన్ మరియు మెసైద్ ఇండస్ట్రియల్ సిటీల్లోని ఆపరేటింగ్ ఫెసిలిటీలపై సైనిక దాడులు జరగడంతో, ఖతార్ ఎనర్జీ (QatarEnergy) తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ LNG సరఫరాలో 20 శాతం వాటా కలిగిన ఖతార్ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళన మొదలైంది.

ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలు:

సరఫరా నిలిచిపోవడంతో యూరప్‌లో సహజ వాయువు ధరలు ఒక్కసారిగా 50 శాతం పెరిగి, ఏడాది కాలంలోనే అత్యధికంగా మెగావాట్ గంటకు €47కి చేరుకున్నాయి. యూరోపియన్ యూనియన్ దిగుమతి చేసుకునే LNGలో 15 శాతం వాటా ఒక్క ఖతార్ నుండే వస్తుంది. తాజా పరిణామాలతో అమెరికా గ్యాస్ వనరుల కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాంకర్ల నిలిపివేత:

కేవలం ఉత్పత్తి కేంద్రాలే కాకుండా, కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా గ్యాస్ ట్యాంకర్ల రవాణాను ఆపరేటర్లు నిలిపివేశారు. ఇది ఇతర మధ్యప్రాచ్య దేశాల నుండి వచ్చే సరఫరాను కూడా అడ్డుకుంటోంది. యూరప్‌లో గ్యాస్ నిల్వలు ప్రస్తుతం 31 శాతం కంటే తక్కువగా ఉండటం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోంది.

Similar News

ఇరాన్.. బ్రహ్మాస్త్రాలు

Next Story