- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్.. బ్రహ్మాస్త్రాలు
ఇరాన్ తన అమ్ములపొదిలోని క్షిపణులను బయటకు తీస్తున్నది. ఇజ్రాయెల్ పై భీకర దాడులకు పాల్పడుతున్నది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ తన సుప్రీం లీడర్ ని కోల్పోవడంతో శత్రు వినాశనమే లక్ష్యంగా అమ్ములపొదలోకి బ్రహ్మాస్త్రాలను బయటకు తీస్తున్నది. ఒక్కో ఆయుధం ఒక్కో ప్రత్యేకత ఉన్నది కావడమే కాకుండా.. ఎంతో గొప్పగా చెప్పుకునే ఐరన్ డోమ్‌ని సైతం అవలీలగా చేధించే శక్తి ఉండటంతో ఇజ్రాయెల్ ఆత్మరక్షణలో పడింది. ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని ఐరన్ డోమ్ హెజ్బొల్లా, హమాస్ లాంటి సంస్థలు ప్రయోగించే చిన్నపాటి లేదా తక్కువ రేంజ్ మిస్సైళ్లను సులభంగా ఇంటర్ సెప్ట్ చేయగలదు. కానీ, ఇరాన్ వద్ద మూడు శక్తిమంతమైన క్షిపణులు ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్లేవి.. పైగా అవి నేరుగా అంతరిక్షంలోకి వెళ్లి అక్కడినుంచి లక్ష్యంవైపు అత్యంత వేగంతో దూసుకువస్తాయి. వీటిని అడ్డుకోవాలంటే అమెరికాకు రక్షణ వ్యవస్థ అయిన థాడ్, ఇజ్రాయెల్ తయారుచేసిన ఆరో 3వంటి వ్యవస్థలు అవసరం. అయితే, పదుల సంఖ్యలో ఒకేసారి ఒకే టార్గెట్ ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగిస్తే మాత్రం ఎయిర్ డిఫెన్స్ పనిచేయలేదు. ఇరాన్ ఇప్పుడు ఇదే పనిని చేస్తున్నది. సోమవారం ప్రయోగించిన క్షిపణుల్లో అత్యంత శక్తిమంతమైనది ఫతా2, దీంతోపాటు ఘదర్, ఖైబర్ మిసైళ్లు ఉన్నాయి. వీటి శక్తియుక్తులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also..ఇరాన్‌లో మిస్సైళ్ల నగరాలు
1. ఫతా 2
ఇరాన్ యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ‘ఫతా-2’ ఒకటి. అరబిక్, పర్షియన్ భాషలలో ఫతా అంటే ‘విజేత’ అని అర్థం. ఇరాన్ విప్లవ దళాలు (ఐఆర్‌జీసీ) జూన్ 2023లో మొదటి వెర్షన్, నవంబర్ 2023లో రెండవ వెర్షన్‌ను (ఫతా-2) ప్రదర్శించాయి. ఇది కేవలం సాధారణ క్షిపణి మాత్రమే కాదు, దీనిని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్‌జీవీ) అని పిలుస్తారు. ఇది ధ్వని కంటే 13 నుంచి 15 రెట్లు వేగంతో (మాక్13-15) ప్రయాణించగలదు. అంటే గంటకు సుమారు 15,000 నుండి 18,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. సాధారణ బాలిస్టిక్ క్షిపణులు విసిరిన రాయిలా ఒకే మార్గంలో వెళ్తాయి. కానీ ఫతా-2 గాలిలో తన దిశను మార్చుకోగలదు. అంటే తనకు ఎదురుగా ఏదైనా క్షిపణి వస్తే దానిని దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. దిశను మార్చుకునే శక్తి ఉండటం వల్ల దీనిని రాడార్లు గుర్తించడం, అడ్డుకోవడం చాలా కష్టం. దీని పరిధి సుమారు 1,400 కిలోమీటర్లు.
అమెరికాను తాకగలవా?
దీని పరిధి 1400కిలోమీటర్లు మాత్రమే కావడం.. అమెరికా ఇరాన్ నుంచి 10వేల కి.మీ. దూరంలో ఉండటంలో నేరుగా ఈ క్షిపణి తాకలేదు. కానీ, మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను (ఉదాహరణకు ఖతార్, కువైట్, బహ్రెయిన్‌లలో ఉన్నవి) ఇది సులభంగా చేరుకోగలదు.
2. ఘదర్ (Ghadr-110)
ఇది ఇరాన్ వద్ద ఉన్న అతివేగవంతమైన, దూరశ్రేణి బాలిస్టిక్ క్షిపణులలో ఒకటి. దీనిని 'షాహాబ్-3' క్షిపణికి మెరుగైన వెర్షన్‌గా పిలుస్తారు. ఘదర్ అంటే పర్షియన్ భాషలో ‘తీవ్రత’ లేదా ‘సామర్థ్యం’ అని అర్థం. ఇది 1,600 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకగలదు. అంటే ఇరాన్ నుంచి నుండి ఇజ్రాయెల్‌లోని ఏ ప్రాంతాన్నైనా సులభంగా చేరుకోగలదు. ఇది ధ్వని కంటే 9 రెట్లు వేగంతో (మాక్9)తో ప్రయాణిస్తుంది. దీనిని కేవలం 30 నిమిషాల్లోనే ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. ఇది మొబైల్ లాంచర్లతో ఎక్కడి నుండైనా ప్రయోగించే అవకాశం ఉన్నది. దీనివల్ల శత్రువులు దీనిని గుర్తించడం కష్టం. ఆదివారం ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఇరాన్ వీటిని అధిక సంఖ్యలో వాడింది.
3. ఖైబర్ (Khyber Missiles)
ఇది ఇరాన్ వద్ద ఉన్న అత్యంత బరువైన శక్తివంతమైన క్షిపణి. దీనిని 2023లో ఆవిష్కరించారు. ‘ఖైబర్’ అనేది చారిత్రాత్మక యుద్ధానికి చిహ్నం. సా.శ. 628లో ముస్లిం సైన్యం యూదుల కోట అయిన ‘ఖైబర్’ను జయించిన జ్ఞాపకార్థం దీనికి ఆ పేరు పెట్టారు. ఇది ప్రత్యక్షంగా ఇజ్రాయెల్‌ను హెచ్చరించడానికే పెట్టిన పేరు. దీని పరిధి 2,000 కిలోమీటర్లు. ఇది 1,500 కిలోల భారీ పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇది ఇరాన్ వద్ద ఉన్న ఇతర క్షిపణుల కంటే చాలా ఎక్కువ విధ్వంసాన్ని కలిగిస్తుంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. 'లిక్విడ్ ఫ్యూయల్' ఇంజిన్ ఉన్నప్పటికీ, దీనిని భూగర్భ గిడ్డంగుల్లో సంవత్సరాల తరబడి నిల్వ ఉంచవచ్చు. ఇది గాలిలో తన దిశను మార్చుకోగలదు, తద్వారా శత్రువుల రాడార్ల నుండి తప్పించుకోగలదు. తాజాగా ఇజ్రాయెల్‌లోని భూగర్భ సైనిక కేంద్రాలను, బంకర్లను ధ్వంసం చేయడానికి ఇరాన్ ఈ క్షిపణులను ప్రయోగించింది.






