ఇరాన్‌లో మిస్సైళ్ల నగరాలు

by Harish SP |   (  Updated:2026-03-02 14:43:17  IST  )

ఇరాన్‌లోని కొన్ని నగరాలు అమెరికాను వణికిస్తున్నాయి. అవేంటో తెలుసా? మిస్సైళ్ల నగరాలు. యెస్ అవి పదికిపైగా ఉన్నాయి.

ఇరాన్‌లో మిస్సైళ్ల నగరాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రత్యర్థి ఎంత బలమైనవాడు అయితే అంత జాగ్రత్తగా ఉండాలని యుద్ధనిపుణులు చెప్తుంటారు. ఇరాన్ కూడా అదే పద్ధతిని అమలు చేసింది. ఇరాన్ ప్రధాన బలం క్షిపణులు. వీటిని ఎంత రక్షించుకుంటే దేశం అంత సురక్షితంగా ఉంటుందని వాటిని శత్రుదుర్బేధ్యమైన కోటల్లో దాచారు. ఆ క్షిపణి గిడ్డంగులలు భూమికి సుమారు 500 మీటర్ల లోతులో నిర్మించారు. ఇవి కేవలం గదులు మాత్రమే కాదు, కొండల లోపల కిలోమీటర్ల పొడవునా సాగే సొరంగ మార్గాలు. వీటి పైన వందల అడుగుల మందపాటి కాంక్రీటు నిర్మాణాలు ఆపైన సహజసిద్ధమైన పర్వత శిలలు ఉంటాయి. దీనివల్ల అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు కూడా వీటిని తాకలేవు. ఈ సొరంగాల్లో వేలాది క్షిపణులను ట్రక్కుల వంటి మొబైల్ లాంచర్లపై సిద్ధంగా ఉంచుతారు. శత్రువులు దాడి చేసినప్పుడు, కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ క్షిపణులను బయటకు తెచ్చి లేదా సొరంగం పైభాగం నుండి ప్రయోగించే వ్యవస్థ ఉంది. ఇవి దేశవ్యాప్తంగా వివిధ పర్వత శ్రేణుల్లో విస్తరించి ఉన్నాయి. వీటి ప్రవేశ మార్గాలు బయట నుంచి చూస్తే సాధారణ గుహల్లా లేదా అడవి ప్రాంతాల్లా కనిపిస్తాయి.

మిస్సైల్ ఫార్మ్స్

ఇరాన్ ఇటీవల మిస్సైల్ ఫార్మ్స్ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇందులో క్షిపణులను భూమి లోపల నిలువుగా పాతిపెడతారు. ఇవి బయటకు కనిపించవు, కానీ అవసరమైనప్పుడు రిమోట్ ద్వారా భూమిని చీల్చుకుని ఆకాశంలోకి దూసుకెళ్తాయి. దీనివల్ల శత్రువుల ఉపగ్రహాలు వీటిని గుర్తించడం దాదాపు అసాధ్యం. ఫిబ్రవరి 28, మార్చి 2 (2026) దాడుల్లో అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దళాలు ఇరాన్ గగనతలంలో తిరుగుతున్నా, ఇరాన్ తన ఘదర్, ఖైబర్ క్షిపణులను ఈ భూగర్భ కేంద్రాల నుండే సురక్షితంగా ప్రయోగించగలిగింది. ఇరాన్ వాదన ప్రకారం, ఒక మిస్సైల్ సిటీ ధ్వంసమైనా, మరో పది నగరాల నుండి దాడులు కొనసాగించే సామర్థ్యం వారికి ఉంది.

Read Also.. ఇరాన్.. బ్రహ్మాస్త్రాలు

Next Story