MODI: ప్రధాని మోడీ సంక్రాంతి ఏఐ విషెస్.. మరోసారి తన మార్క్ చాటుకున్న పీఎం

by Prasad Jukanti |   (  Updated:2026-01-14 07:07:53  IST  )

సంక్రాంతి సంబరాల వేళ శుభాకాంక్షలు తెలిపే విషయంలో మోడీ మరోసారి తన మార్క్‌ను చాటుకున్నారు.

MODI: ప్రధాని మోడీ సంక్రాంతి ఏఐ విషెస్.. మరోసారి తన మార్క్ చాటుకున్న పీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) రొటీన్‍కు భిన్నంగా వ్యవహరిస్తారనేది తెలిసిందే. తాజాగా సంక్రాంతి (Sankranti Wishes) సంబరాల వేళ శుభాకాంక్షలు తెలిపే విషయంలో మోడీ మరోసారి తన మార్క్‌ను చాటుకున్నారు. సంక్రాంతి వేళ దేశంలోని అనేక మందికి మోడీ పేరుతో ఏఐ జనరేటెడ్ పోస్టు కార్డులు ఈ-మెయిల్స్ (AI Generated Greetings) రూపంలో వచ్చాయి. వ్యక్తులను వారి పేర్లతో ప్రస్తావిస్తూ ప్రధాని ఫొటోతో ఉన్న విషెస్ కార్డ్స్ ఆసక్తిగా మారాయి. ‘మంగళకమైన ఈ సంక్రాంతి పండగ శుభవేళ.. మీకు.. మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. మన దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో, రకరకాల సంప్రదాయాలతో జరుపుకున్నా.. మనందరినీ కలిపి ఉంచే ఆత్మీయత. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కూడా సరికొత్త ఆశయాలను, ఉన్నతమైన లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నాను’ అని తెలుగులో సందేశం ఇచ్చారు. కాగా పీఎం మోడీ పంపిన ఈ విషెస్ అందుకున్న వారు సంతోషం పడుతున్నారు. అనేక మంది యువ నేతలు ఏఐని వినియోగించడంలో తడబడుతున్న సమయంలో ప్రధాని మోడీ టెక్నాలజీ వినియోగించడంలో ఆసక్తిని చూపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE ....

పొంగల్ వండిన ప్రధాని మోదీ.. తమిళ సాంస్కృతిక వారసత్వంపై ప్రశంసలు

Next Story