గుజరాత్ రిజల్ట్స్.. Modi, Amit Shah కీలక నిర్ణయం!

by Disha Web Desk 2 |
గుజరాత్ రిజల్ట్స్.. Modi, Amit Shah కీలక నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించింది. 2017లో జరిగిన ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన బీజేపీ, ఈసారి 150 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. సొంత రాష్ట్రాన్ని కాపాడుకునేలా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు నిర్వహించిన వినూత్న ప్రచార శైలి బీజేపీకి కలిసొచ్చింది. ఇప్పటికే ఫలితాలపై స్పందించిన మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని గుజరాత్ రానున్నారు. స్వరాష్ట్రంలో జరిగే గెలుపు సంబురాల్లో పాల్గొనున్నారు. కాగా, వరుసగా ఏడోసారి విజయం సాధించిన బీజేపీ పశ్చిమబెంగాల్ సీపీఎం రికార్డును తిరగరాసింది.

Also Read: Gujarat ఎన్నికల ఫలితాలపై Modi రియాక్షన్ ఇదే!


Next Story