- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాపం ప్రశాంత్ కిషోర్.. కనీసం ఒక్క ఆధిక్యం కూడా లేదు
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చింది అనే సామెత మాదిరి అయింది జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పరిస్థితి.

X
దిశ, వెబ్ డెస్క్ : అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చింది అనే సామెత మాదిరి తయారైంది జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. గత రెండు దశాబ్దాలుగా అనేక పార్టీలకు ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా పని చేసి, వారు భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు రచించారు ప్రశాంత్ కిషోర్. ఇక తాను స్వయంగా రాజకీయాల్లోకి దిగి జన సూరజ్ పార్టీ స్థాపించి బిహార్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి దిగారు. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా కనీసం ఆధిక్యాన్ని కూడా కనబరచలేకపోతోంది. మొత్తం 243 స్థానాల్లో ఏ ఒక్క చోట కూడా జన సూరజ్ పార్టీ ఓట్లు సాధించ లేకపోయింది. అందరికీ స్ట్రాటజీలు ప్లే చేసే పీకే తన విషయం వచ్చేసరికి చతికిల పడిపోయాడు పాపం అంటున్నారు రాజకీయ విమర్శకులు.
Read More..
Next Story






