- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిహార్ ఓట్ల లెక్కింపులో లీడ్‌లో ఎమ్ఐఎమ్ అభ్యర్థులు
బిహార్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఎన్డీయే కూటమి 175 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: బిహార్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఎన్డీయే కూటమి 175 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో AIMIM పార్టీ 25 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా వారిలో 23 మంది పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ రెండు నియోజకవర్గాల్లో మాత్రం ప్రస్తుతం ఇద్దరు అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. అందులో బైసి నియోజకవర్గం నుంచి ఎమ్ఐఎమ్ అభ్యర్థి గులాం సర్వార్, బీజేపీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ పై 6 వేల ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నాడు. అలాగే బలరాం పూర్ నుంచి అదిల్ హాసన్ 1984 ఓట్లతో.. రామ్ విలాస్ అభ్యర్థి సంగీత దేవి పై లీడ్ లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే చివరి వరకు ఈ లీడ్ ఇలానే కొనసాగుతుందా.. లేఖ ఆధిక్యం తారుమారు అయ్యే అవకాశం ఉందా తెలియాలంటే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.
Read More..
Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్
Bihar: ఓవైపు కౌంటింగ్ మరో వైపు ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నిరసన






