- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bihar: ఓవైపు కౌంటింగ్ మరో వైపు ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నిరసన
బిహార్ ఓట్ల లెక్కింపు జరుగుతుండగా కాంగ్రెస్ నిరసనకు దిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్‍లో ఓట్ల లెక్కింపు (Bihar Counting) కొనసాగుతోంది. మరోసారి ఎన్డీయే కూటమికే అక్కడి ఓటర్లు జై కొట్టారు. మెజార్టీ మార్క్ 122 స్థానాలను దాటుకుని ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే బిహార్‍లో అధికారంలోకి వస్తామని ఆశించిన కాంగ్రెస్ తో కూడిన మహాగఠ్ బంధన్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్డీయే కూటమికి కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోతోంది. ఈ క్రమంలో ఓ వైపు కౌంటింగ్ కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్ నిరసనలకు (Congress protests) దిగింది. ఓట్ చోరీ (vote chori) అంటూ ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 65 లక్షల ఓట్లను, అందులో చాలా వరకు ప్రతిపక్ష ఓట్లను ఎస్ఐఆర్ పేరుతో తొలగించాక కౌంటింగ్ రోజు ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం అని ప్రశ్నించారు. ఇలా మ్యాచ్ కంటే ముందే మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడితే ఇక ప్రజాస్వామ్య ఎలా మనుగడ సాధించగలదని ప్రశ్నించారు.
Read More..
Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్
Assembly election results:బీహార్ రాజకీయాల్లో సంచలనం… సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న ఆ పోస్ట్!






