- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Assembly election results:బీహార్ రాజకీయాల్లో సంచలనం… సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న ఆ పోస్ట్!
దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు(నవంబర్ 14) ఉదయం ప్రారంభమైంది.

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు(నవంబర్ 14) ఉదయం ప్రారంభమైంది. ఈ క్రమంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైన ఎన్డీయే కూటమి లీడింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించుతూ అధికార ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం.. ఎన్డీయే 132 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్(122)ను క్రాస్ చేసింది.
మరో వైపు మహాగఠ్‌బంధన్ కూటమి 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే.. ఈ ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యం చూపుతోంది. దీంతో గెలుపు పై సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని JDU నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా.. JDU నేతలు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘బీహార్ లో మరోసారి నితీష్ ప్రభుత్వం రానుంది. అందుకు బీహార్ సిద్ధంగా ఉంది’’ అనే పోస్ట్ హల్‌చల్ చేస్తోంది.Link
Read More..






