155 స్థానాల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యం

by Malleboina Mahesh |   (  Updated:2025-11-14 04:28:53  IST  )

దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అధికార ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో దూసుకుపోతుంది. మొ

155 స్థానాల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యం
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అధికార ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో దూసుకుపోతుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా అన్ని స్థానాల్లోని క్లియర్ ఫలితాలు వస్తున్నాయి. మొత్తం 155 స్థానాల్లో ఎన్డీయే కూటమి క్లియర్ లీడ్ లో కొనసాగుతూ.. అధికారం కోసం కావాల్సిన 123 స్థానాలు దాటేసి క్లియర్ మెజార్టీతో ఎన్డీయే కూటమి దూసుకు పోతుంది. ఇందులో JDU 64, BJP 67, HAM 5, RLM 3, LJP 12 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి.

అలాగే ప్రతిపక్షంలోని మహా‌ఘట్‌బంధన్ కూటమి మొత్తం 81 స్థానాల్లో లీడులో ఉండగా.. ఇందులో RJD 55,CONGRESS 17, CPI(ML) 7, CPI 1,VIP 2, స్థానాల్లో లీడ్‌లో కొనసాగున్నారు. అలాగే జన సూరజ్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు లీడ్ లో ఉండగా ఇతరులు మరో 3 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించుతూ ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మహాఘట్‌బంధన్ కూటమితో పోటీలో నిలిచిన RJD 2020లో గెలిచిన స్థానాల కంటే తక్కువ లీడ్ కొనసాగిస్తుంది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగుద్దా.. లేఖ పోటాపోటిగా మారుద్దా తెలియాలంటే మధ్యాహ్నం 1 గంట వరకు వేచి చూడాల్సిందే.

Read More..

Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్

రాష్ట్ర బీజేపీ నేతలకు మైండ్ బ్లాంక్... షేక్‌పేట్‌లో బీజేపీ కనుమరుగు

Next Story