రాష్ట్ర బీజేపీ నేతలకు మైండ్ బ్లాంక్... షేక్‌పేట్‌లో బీజేపీ కనుమరుగు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-14 04:27:47  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.

రాష్ట్ర బీజేపీ నేతలకు మైండ్ బ్లాంక్... షేక్‌పేట్‌లో బీజేపీ కనుమరుగు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గెలుపు కోసం తమ శక్తి వంచన లేకుండా బడా లీడర్లు గల్లీ గల్లీకి తిరుగుతూ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కౌంటింగ్ వేళ వస్తున్న ఫలితాలను చూసి ఆయా పార్టీల నేతలు నోళ్లు వెల్లబెడుతున్నారు. ఈ క్రమంలోనే తొలి రౌండ్‌ కౌంటింగ్‌లో భాగంగా షేక్‌పేట్ డివిజన్‌ పరిధిలో బీజేపీ కనుమరుగైంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప అధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రస్‌కు ఎదురొడ్డి నిలిచి స్ట్రాంగ్ ఫైట్ చేస్తోంది. షేక్‌పేట్ డివిజన్‌లో రెండు రౌండ్లు కలిపి బీజేపీ అభ్యర్థికి లంకల దీపక్‌రెడ్డికి 307 ఓట్లు మాత్రమే రావడం రాష్ట్ర బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలో కేంద్ర మంతులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ప్రచారం చేసిన లాభం లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Read More..

Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్

Jubilee Hills: షేక్‍పేట డివిజన్‍లో కాంగ్రెస్ దే పై చేయి... కాంగ్రెస్‍ను బీఆర్ఎస్ ఓవర్ టేక్ చేసేనా?

Next Story