- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోపాలున్నాయి.. ఇదిగో నా బోర్డింగ్ పాస్.. అదే విమానంలో ఢిల్లీ నుంచి వచ్చా.. ప్రయాణికుడి పోస్ట్ వైరల్
గుజరాత్‌లోని ఆహ్మాదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని ఆహ్మాదాబాద్‌లో జరిగిన (Air India flight crash) ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా 241 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపాలతో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ (Delhi to Ahmedabad) వచ్చినట్లు అదే విమానంలో ప్రయాణించిన ఆకాశ్ వత్స (Akash Vatsa) అనే వ్యక్తి ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. విమానంలో లోపాలను చిత్రీకరించి వీడియో ఎక్స్ వేదికగా ఆకాశ్ వత్స పోస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు అదే విమానంలో ప్రయాణించానని, ఏసీ పని చేయలేదని, విమానంలో కనీస సౌకర్యాలను కూడా పరీక్షించలేదని ప్రయాణికుడు ఆరోపించారు.
దీంతో అతని ఆరోపణలను కొంత మంది నెటిజన్లు కొట్టిపారేశారు. తను సోషల్ మీడియాలో లైక్స్, ఫాలోవర్స్ కోసం ఇదంతా క్రియేట్ చేశాడని, అతను ప్రమాదం జరిగిన విమానంలో కాకుండా వేరొక విమానంలో ప్రయాణం చేసి పోస్ట్ చేశాడని నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆకాశ్ ఎక్స్ వేదికగా మరో పోస్ట్ చేస్తూ ఆ విమానంలో ట్రావెల్ చేసినట్లు స్పష్టం చేశారు. ‘ఇదిగో నా బోర్డింగ్ పాస్ (boarding pass).. నన్ను నమ్మని వ్యక్తుల కోసం టికెట్ పోస్ట్ చేస్తున్నాను. నా చుట్టూ నెగిటివ్‌గా ఆలోచించే ప్రజలు ఉన్నారు’ అని పోస్ట్ చేశారు. బోర్డింగ్ పాసులో సైతం అతను చెప్పిన విధంగా గురువారం ఢిల్లీ నుంచి అహ్మాదాబాద్‌కి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చినట్లు టికెట్ చూపిస్తుంది. ఇందుకు సంబంధించిన పోస్ట్ సైతం వైరల్ అవుతోంది.
Read More..
Air India: నాన్నా.. ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంట.. తండ్రితో పైలట్ సుమిత్ చివరి మాటలు






