తమిళనాడులో పొలిటికల్ సెన్సేషన్.. AIADMK చీలిక, 150కి చేరిన సీఎం విజయ్ బలం

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-12 06:22:47  IST  )

తమిళనాడు పాలిటిక్స్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. AIADMKలో చీలికతో సీఎం విజయ్‌కి షణ్ముగం వర్గం మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించింది.

తమిళనాడులో పొలిటికల్ సెన్సేషన్.. AIADMK చీలిక, 150కి చేరిన సీఎం విజయ్ బలం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్షం AIADMKలో ఆ పార్టీ సీనియర్ నేత షణ్ముగం తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ, తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్, టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే, షణ్ముగం వెంట దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తన మద్దతుదారులతో సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రేపు అసెంబ్లీలో జరగనున్న ఫ్లోర్ టెస్ట్‌లో సీఎం విజయ్‌కు అనుకూలంగా ఓటు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో విజయ్ మెజారిటీ మార్కు ఒక్కసారిగా 150కి చేరనుంది.

విజయ్ సర్కార్ సేఫ్..

సీఎం బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు సొంత పార్టీ బలం తక్కువగా ఉందన్న విమర్శల నేపథ్యంలో AIADMK నుంచి వస్తున్న ఈ మద్దతు ఆయనకు కొండంత బలాన్ని ఇస్తోంది. మరోవైపు, ఈ చీలికతో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (EPS) నాయకత్వంలోని AIADMK తీవ్ర సంక్షోభంలో పడింది. రేపటి ఫ్లోర్ టెస్ట్ కేవలం నామమాత్రంగానే మారనుందని,

సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. ఏకంగా 717 వైన్ షాపుల మూసివేత

Next Story