- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. ఏకంగా 717 వైన్ షాపుల మూసివేత
రాష్ట్రంలోని మందుబాబులకు షాకిచ్చేలా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే తలపతి విజయ్ (Vijay) ప్రజా సక్షేమం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా, ప్రజలకు అసౌకర్యంగా ఉన్న 717 వైన్ షాపులను రాబోయే 2 వారాల్లోగా మూసివేయాలని ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్నవి, ఆలయాలు, చర్చిలు, మసీదులకు దగ్గరగా ఉన్నవి, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను తక్షణమే తొలగించా ఆర్డర్స్ వెలువడ్డాయి.
కాగా, తమిళనాడు రాష్ట్ర వాణిజ్య సంస్థ (TASMAC) ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 4,765 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. అందులో నిబంధనలు విరుద్ధంగా 717 మద్యం దుకాణాలు నడుస్తున్నట్లుగా గుర్తించారు. వాటన్నింటినీ 2 వారాలు అంటే 14 రోజుల వ్యవధిలో పూర్తిగా మూసివేయించాలని సీఎం విజయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.






