- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్యామాప్రసాద్, దీన్‌దయాల్, వాజ్‌పేయీ విగ్రహాలు గొప్ప స్ఫూర్తినిస్తాయి: ప్రధాని మోడీ
శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాలు దేశానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాలు దేశానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ 101వ జయంతి సందర్భంగా గురువారం లక్నోలోని రాష్ట్రీయ ప్రేరణ స్థల్ జాతీయ స్మారక సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 65 అడుగుల ఎత్తైన శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. దేశ ఐక్యత, జాతీయ సేవ, సాంస్కృతిక చైతన్యానికి వాజ్‌పేయీ విశేషంగా కృషి చేశారని ప్రధాని మోడీ అన్నారు.
డిసెంబర్ 25న వాజ్‌పేయీతో పాటు మదన్‌మోహన్ మాలవీయ జన్మదినం కూడా ఉండటం దేశానికి గర్వకారణమని అన్నారు. వాజ్‌పేయీ, మదన్‌మోహన్ మాలవీయ భారత ఏకత్వానికి కృషి చేశారని కొనియాడారు. 65 ఎకరాల్లో రూ.230 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ప్రేరణా స్థల్‌ను జాతికి అంకితం చేశారు. కమలాకార నిర్మాణంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక మ్యూజియం (98,000 చదరపు అడుగుల విస్తీర్ణం)లో వాజ్‌పేయీ, శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాల్ ఉపాధ్యాయుల జీవితాలు, దేశ నిర్మాణానికి చేసిన సేవలను ప్రదర్శిస్తున్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని సహా నేతలు మ్యూజియాన్ని సందర్శించి ప్రదర్శనలను వీక్షించారు.
Related News : కట్నంగా పాకిస్తాన్ కావాలన్న వాజ్ పేయ్






