- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కట్నంగా పాకిస్తాన్ కావాలన్న వాజ్ పేయ్
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జయంతి నేడు.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జయంతి నేడు. అయితే వాజ్‌పేయీకి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను ఆయన 101వ జయంతి సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... వాజ్‌పేయీ పాకిస్థాన్ పర్యటన సమయంలో ఆయన ప్రసంగాలకు ఆకర్షితురాలైన ఓ పాకిస్థాన్ మహిళ ఆయన వద్దకు వచ్చి “నన్ను పెళ్లి చేసుకుంటారా? అందుకు బదులుగా కశ్మీర్‌ను గిఫ్ట్ గా ఇస్తారా?” అని అడిగిందని చెప్పారు. దీనికి వాజ్‌పేయీ స్పందిస్తూ “నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే, కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి” అని తన వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించారని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఈ మాటలతో ఆ మహిళ నోరు మూయించడంతో పాటు, వాజ్‌పేయీని ‘వాచస్పతి’గా ఎందుకు కొనియాడతారో మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు.
Next Story






