- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. మూడు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు
ఓ విమానం అత్యవసరంగా రోడ్డుపై ల్యాండ్ బీభత్సం సృష్టించిన ఘటన అమెరికాలోని జార్జియా (Georgia) రాష్ట్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఓ విమానం అత్యవసరంగా రోడ్డుపై ల్యాండ్ బీభత్సం సృష్టించిన ఘటన అమెరికాలోని జార్జియా (Georgia) రాష్ట్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అట్లాంటా నగరానికి ఉత్తరాన ఉన్న గైనెస్‌విల్లే (Gainesville)లో ‘హాకర్ బీచ్‌క్రాఫ్ట్ BE-36’ అనే సింగిల్ ఇంజిన్ విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా ఇంజిన్‌లో టెక్నికల్ సమస్య తలెత్తింది. విమానం అదుపు తప్పుతుండటంతో పైలట్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సమీపంలోని రద్దీగా ఉండే రహదారిని రన్‌వేగా భావించి విమానాన్ని దించేందుకు ప్రయత్నించారు. విమానం రోడ్డుపైకి దూసుకొస్తున్న క్రమంలో అక్కడ ప్రయాణిస్తున్న మూడు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ అనూహ్య ఘటనతో ఒక్కసారిగా స్థానికులు షాక్‌కు గురయ్యారు. విమానం రెక్కలు, ముందు భాగం కార్లను తాకడంతో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
దర్యాప్తు ప్రారంభం..
ఈ ప్రమాదంతో గోల్డెన్ కోరల్ (Golden Coral) ప్రాంతంలోని రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి విమానాన్ని రోడ్డుపై నుంచి తొలగించే చర్యలు చేపట్టారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఇంజిన్ వైఫల్యానికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషిస్తున్నారు.






