- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా ఇల్లు కూల్చిన వారికి ప్రజలే బుద్ధి చెప్పారు.. బీఎంసీ ఫలితాలపై కంగనా రనౌత్ హర్షం
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో, ముఖ్యంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడంపై నటి, ఎంపీ కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో, ముఖ్యంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడంపై నటి, ఎంపీ కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో తన కార్యాలయాన్ని కూల్చివేసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గంపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా బీఎంసీ ఫలితాలపై ఆమె ఒక వీడియో విడుదల చేశారు. "నన్ను వేధించి, నా బంగ్లాను కూల్చివేసి, నన్ను ముంబయి వదిలి వెళ్లాలని బెదిరించిన వారిని ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలే సాగనంపారు" అని కంగనా వ్యాఖ్యానించారు. మహిళా వ్యతిరేక 'బంధుప్రీతి మాఫియా'కు ఓటర్లు సరైన గుణపాఠం చెప్పారని ఆమె ఎద్దేవా చేశారు.
ఈ ఎన్నికల ఫలితాలే సరైన సమాధానం..
2020లో శివసేన అధికారంలో ఉన్న సమయంలో, బాంద్రాలోని కంగనా కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు అక్రమ నిర్మాణమంటూ కూల్చివేసిన విషయం తెలిసిందదే. అప్పట్లో ఈ చర్యపై బాంబే హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అది దురుద్దేశపూర్వక చర్యగా పేర్కొంది. కాగా, మహారాష్ట్రలోని మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల మహాయుతి కూటమి విజయం సాధించింది. బీఎంసీలో 89 స్థానాలను గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ చారిత్రక విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లకు కంగనా అభినందనలు తెలిపారు. గతంలో జరిగిన అవమానాలకు ఈ ఎన్నికల ఫలితాలే సరైన సమాధానమని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
Read More..






