- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబై ఎన్నికల విజయంపై మోడీ ట్వీట్
మహారాష్ట్రలో నేడు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి భారీ విజయం దక్కింది.

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో నేడు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి భారీ విజయం దక్కింది. ముఖ్యంగా దేశంలోనే అత్యంత సంపన్నమైన నగర సంస్థ అయిన బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)లో మహాయుతి ఘన విజయం సాధించింది. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. "మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి పాలన అజెండాకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చారు. NDAపై ప్రజల నమ్మకం మరింత పెరిగింది" అని మోడీ పేర్కొన్నారు.
అభివృద్ధి, పాలనలోని ట్రాక్ రికార్డ్ ప్రజల మనసులను గెలుచుకున్నాయని మోడీ ట్వీట్‌లో తెలిపారు. ముంబైతో పాటు పూణే, ఠాణే, నాగ్‌పూర్, నవి ముంబై వంటి ప్రధాన నగరాల్లోనూ మహాయుతి ఆధిక్యం సాధించగా, మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల విజయం దక్కింది. ఈ ఫలితాలు మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వానికి మరింత బలాన్ని ఇచ్చాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.






