- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క తప్పు చేసినా యుద్ధం మొదలే: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
ఇరాన్‌కు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒప్పందం ఉల్లంఘిస్తే మునుపెన్నడూ చూడని విధంగా ‘షూటింగ్’ మొదలవుతుందని కామెంట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. రెండు వారాల తాత్కాలిక యుద్ధ విరామం ప్రకటించిన కొద్ది గంటల్లోనే, ఇరాన్ నిబంధనలను అతిక్రమిస్తే భయంకరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ (Truth Social)లో ‘అమెరికాకు చెందిన అన్ని నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక బలగాలు అదనపు ఆయుధ సంపత్తితో ఇరాన్ సరిహద్దుల్లోనే ఉంటాయి. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే దాడులు తప్పవని అన్నారు. ఇప్పటికే బలహీనపడిన శత్రువును పూర్తిగా తుడిచిపెట్టడానికి అవసరమైన ప్రతిదీ మా దగ్గర సిద్ధంగా ఉంది. మేము అనుకున్న నిజమైన ఒప్పందం (Real Agreement) పూర్తిగా అమలు అయ్యే వరకు మా సైన్యం వెనక్కి రాదు’ అని పోస్ట్ చేశారు.
ఒకవేళ ఏ కారణం చేతనైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, అప్పుడు మళ్లీ అసలైన ‘షూటింగ్’ (War) మొదలవుతుందని ట్రంప్ అన్నారు. అది ఇరాన్ ఇప్పటివరకు చూడని విధంగా అత్యంత శక్తివంతంగా, భారీగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉండకూడదని, అలాగే హోర్ముజ్ జలసంధిని ఖచ్చితంగా అందరి కోసం తెరిచి ఉంచాలని ట్రంప్ అన్నారు. ప్రస్తుతానికి మా గొప్ప సైన్యం ఆయుధాలను నింపుకుంటూ, విశ్రాంతి తీసుకుంటోందని తెలిపారు. నిజానికి, తమ సైన్యం నెక్ట్స్ విజయం (Conquest) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు వేశారు.
రిపోర్టులు తారుమారు.. పాక్‍కు పెత్తనమిస్తే నిండా ముంచేసిందా?






