- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్‍పై సభలో రచ్చ.. ప్రారంభమైన కాసేపటికే లోక్‍సభ వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభలో నిరసనల హోరు మొదలైంది. అయోధ్య, నీట్ అంశాలపై విపక్షాల పట్టుబట్టడంతో సభ వాయిదా వేశారు. అంతకు ముందు భాస్కరరావు మృతి పట్ల లోక్‍సభ సంతాపం వ్యక్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో సమావేశం ప్రారంభం కాగానే విపక్షాలు నిరసనకు దిగాయి. దీంతో ప్రారంభమైన కాసేపటికే సభ వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభ్యులు సభా మర్యాద పాటించాలని స్పీకర్ సూచించారు. సభ్యులు మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తామన్నారు. చర్చలు, ప్రశ్నలు లేవనెత్తడానికే పార్లమెంట్ ఉందన్నారు. సహృద్భావ వాతావరణంలో చర్చలు జరపాలన స్పీకర్ సూచించారు. అయినా విపక్ష సభ్యులు తమ నిరసన ఆపలేదు. అయోధ్య అంశం, నీట్ పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభ్యుల నిరసన మధ్యే ప్రశ్నోత్థరాలు చేపట్టగా స్పీకర్ పోడియం వైపు విపక్ష సభ్యులు వచ్చి నినాదాలు చేశారు. విపక్షాల నిరసనల మధ్య లోక్ సభ వాయిదా వేశారు. అంతకు ముందు ఇటీవల మృతి చెందిన పార్లమెంట్ సభ్యులకు లోక్ సభ సంతాపం తెలిపింది. ఇటీవల మరణించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల లోక్ సభ సంతాపం వ్యక్తం చేసింది.






