- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటూ వార్తలు.. పార్లమెంట్ వేదికగా ప్రధాని క్లారిటీ
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక రాజకీయం లేదన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇచ్చారు. ఉత్తరాది, దక్షిణాది అని మాకు తేడా లేదని కశ్మీర్ టు కన్యాకుమారి అన్ని ప్రాంతాలు మాకు సమానమేనన్నారు. డీలిమిటేషన్ బిల్లుతో చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదన్నారు. మీకు గ్యారెంటీ కావాలంటే నా మాటే గ్యారెంటీ అన్నారు. ఇవాళ లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఏ రాష్ట్రంపైనా మాకు వివక్ష లేదన్నారు.
నాకు క్రెడిట్ అక్కర్లేదు:
మోడీ స్వార్థం కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లు తెచ్చారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తే నాకే లాభం అని మహిలా రిజర్వేషన్ బిల్లుపై నాకు క్రెడిట్ అవసరం లేదన్నారు. అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతూ రేపు ప్రకటన ఇస్తానన్నారు. పంచాయతీల్లో మహిలా రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు. లోక్ సభలో అమలు చేస్తుంటే అడ్డుకుంటున్నారు. మహిళల్లో రాజకీయ చైతన్యం బాగా పెరిగింది. పంచాయతీల్లోనే కాదు అత్యున్నత చట్టసభల్లోనూ భాగస్వామ్యం కోరుకుంటున్నారు. పార్లమెంట్ పై నాకు నమ్మకం ఉందని వెనుకబడిన వర్గానికి చెందిన నాకు ప్రధాని పదవి దక్కింది. తప్పకుండా ఓబీసీలకు న్యాయం చేస్తామన్నారు.
వాళ్లను మహిళలే చెప్పుతో కొడతారు: పార్లమెంట్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు






