వాళ్లను మహిళలే చెప్పుతో కొడతారు: పార్లమెంట్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-16 10:36:05  IST  )

దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

వాళ్లను మహిళలే చెప్పుతో కొడతారు: పార్లమెంట్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈ బిల్లు దేశానికి సరికొత్త దశను, దిశను నిర్దేశిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడంలో తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ప్రధాని స్పష్టం చేశారు. "ఇది కేవలం రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం తెచ్చిన బిల్లు కాదు.. దేశ ప్రజల ప్రయోజనం కోసం, దేశ ప్రగతి కోసం తెచ్చిన బిల్లు" అని ఆయన పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర చాలా కీలకమని, వారికి తగిన అవకాశం కల్పిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని ఆయన కొనియాడారు. వికసిత్ భారత్ అంటే కేవలం రోడ్లు, రైళ్లు, భవనాలు వంటి మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని.. అన్ని వర్గాల, అన్ని రంగాల ప్రజల సమగ్ర అభివృద్ధే అసలైన వికసిత్ భారత్ అని పేర్కొన్నారు.

గత పాలకులపై విమర్శలు...

మహిళా బిల్లు విషయంలో గత ప్రభుత్వాల తీరును ప్రధాని ఎండగట్టారు. "30 ఏళ్ల క్రితమే మహిళా బిల్లు తెచ్చామంటున్న వారు, దాని వల్ల ఎవరికైనా మేలు జరిగిందా? అని ఆత్మవిమర్శ చేసుకోవాలి" అని ప్రశ్నించారు. తమకు అన్యాయం చేసిన వారిని మహిళలు సమయం చూసి దెబ్బకొడతారని ఆయన హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును దేశవ్యాప్తంగా ప్రజలందరూ స్వాగతిస్తున్నారని మోడీ తెలిపారు. ఈ బిల్లు విషయంలో ఎలాంటి రాజకీయాలు చేయకుండా, పక్షపాతాలకు అతీతంగా సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని ప్రధాని పార్లమెంట్ సాక్షిగా కోరారు.

డీలిమిటేషన్‌తో ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయం అంటూ వార్తలు.. పార్లమెంట్‌ వేదికగా ప్రధాని క్లారిటీ

Next Story