- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ భయపడ్డారు.. నేను ఆ భయాన్ని చూశాను: నటుడు ప్రకాష్ రాజ్
పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనపై ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ నీట్ పేపర్ లీక్ (NEET paper leak) కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు ఉద్రిక్తంగా మారుతున్న విషయం తెలిసిందే. సీజేపీ, విద్యార్థులు చేస్తున్న ఈ నిరసనలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. దానిపై నటుడు ప్రకాష్ రాజ్ (Actor Prakash Raj) స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. మోడీ చేసిన ప్రకటనపై ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. రేపటి కేబినెట్ భేటీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా మరింత కఠినమైన చర్యలు తీసుకోబోతున్నామంటూ ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించగా, దానికి స్పందిస్తూ ప్రకాష్ రాజ్ రీట్వీట్ చేశారు.
ప్రధాని పోస్ట్‌ను ఉద్దేశించి "డర్ గయా.. నేను ఆయనలో భయాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను" అంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు సాగిస్తున్న పోరాటం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. నీట్ తదితర పేపర్ లీక్ ఘటనలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశ యువతకు, నిరసనకారులకు (కాక్రోచ్‌లకు) ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రం నిర్ణయం మార్చుకోవడానికి ఐక్యంగా నిలబడిన యువత తెగించే తత్వమే కారణమని వ్యాఖ్యానిస్తూ #justasking హ్యాష్‌ట్యాగ్‌తో ఈ పోస్ట్‌ను షేర్ చేయడంతో ఇది ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






