కర్ణాటక బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-25 06:13:22  IST  )

క‌ర్ణాట‌క‌లో ఘోర బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింది. గురువారం ఉద‌యం బెంగ‌ళూరు నుండి గోక‌ర్ణ వెళ్తున్న సీబ‌ర్డ్ ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సును ఓ కంటైన‌ర్ లారీ ఢీ కొట్టింది.

కర్ణాటక బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: క‌ర్ణాట‌క‌లో ఘోర బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింది. గురువారం ఉద‌యం బెంగ‌ళూరు నుండి గోక‌ర్ణ వెళ్తున్న సీబ‌ర్డ్ ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సును ఓ కంటైన‌ర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 20మంది మృతి చెందారు. ప్ర‌మాదం నుండి డ్రైవ‌ర్, కండ‌క్ట‌ర్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. బ‌స్సులో మొత్తం 32 మంది ఉండ‌గా క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ స్పందించ‌గా తాజాగా ప్ర‌ధాని మోడీ సైతం స్పందించారు. ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. చ‌నిపోయిన కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డిన‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించారు. అంతే కాకుండా పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి మృతుల కుటుంబాల‌కు ప్ర‌ధాని రూ.2 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌కటించారు. గాయ‌ప‌డిన‌వారికి రూ.50వేలు ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల దేశంలో బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌లు పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఏపీలోని క‌ర్నూల్ బ‌స్సు ప్ర‌మాదం మ‌ర‌వ‌క ముందే దేశంలో వ‌రుస ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

Read More..

చిత్రదుర్గ బస్సు ప్రమాదంపై కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

BIG BREAKING: పండుగ వేళ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం.. 17 మంది సజీవదహనం

Next Story