BIG BREAKING: పండుగ వేళ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం.. 17 మంది సజీవదహనం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-25 01:59:29  IST  )

క్రిస్మస్ పండుగ పూట రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.

BIG BREAKING: పండుగ వేళ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం.. 17 మంది సజీవదహనం
X

దిశ, వెబ్‌డెస్క్:క్రిస్మస్ పండుగ పూట రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును లారీ ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ప్రమాదంలో 17 మంది సజీవదహనమయ్యారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. హిరియూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న లారీ.. అదుపుతప్పి రోడ్డుకు అటుపక్క వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మంటలు బస్సును పూర్తిగా కమ్మేశాయి. బస్సు నుంచి బయటపడే వీలు లేకపోవడంతో 17 మంది సజీవదహనం అయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Read More..

ఢాకాలో పేలుడు.. ఒకరు మృతి

Next Story