- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢాకాలో పేలుడు.. ఒకరు మృతి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పేలుడు సంభవించింది. మోగ్ బజార్ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ పైనుంచి

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పేలుడు సంభవించింది. మోగ్ బజార్ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ పైనుంచి బుధవారం సాయంత్రం ఒక గ్రూప్.. ముడి పేలుడు పదార్థాన్ని విసిరి వేయడంతో ఒక వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని సియామ్ అనే వ్యక్తిగా గుర్తించారు. మొఘ్‌బజార్ స్వాతంత్ర్య సమరయోధుల స్మారక చిహ్నం ముందు ఉన్న ఫ్లైఓవర్ కింద ఈ పేలుడు సంభవించింది. ఫ్లైఓవర్ నుండి ఎవరో కాక్‌టెయిల్ బాంబును విసిరారని, అది బాధితుడి తలపై పడి పేలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. మృతుడు ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని, ప్రమాదం సమయంలో ఆ ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. దాడి చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More..
BIG BREAKING: పండుగ వేళ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం.. 17 మంది సజీవదహనం






