- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్రదుర్గ బస్సు ప్రమాదంపై కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హిరియూరు సమీపంలో జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హిరియూరు సమీపంలో జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదం (road accident) తీవ్ర విషాదాన్ని నింపింది. బెంగళూరు నుంచి గోకర్ణ వైపు వెళ్తున్న బస్సు, ఒక లారీని బలంగా ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని 17 మంది సజీవ దహనమయ్యారు. క్రిస్మస్ సెలవుల కోసం ఇంటికి వెళ్తున్న వారి ప్రయాణం ఇలా విషాదాంతం కావడం అందరినీ కలచివేసింది. ఈ ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఈ ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని, ప్రమాదానికి గల కారణాలను వెలికితీసేందుకు సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మరోవైపు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రయాణికులు ఇలా మంటల్లో కాలిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికరమని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి విషాదాలు మళ్లీ పునరావృతం కాకూడదని ఆయన ఆకాంక్షించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు.
Read More..






