ఘోర బస్సు ప్రమాదం.. తృటిలో తప్పించుకొన్న 42 మంది చిన్నారులు

by Muthe.Rajitha |   (  Updated:2025-12-25 05:32:02  IST  )

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

ఘోర బస్సు ప్రమాదం.. తృటిలో తప్పించుకొన్న 42 మంది చిన్నారులు
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 20 మంది సజీవ దహనం కాగా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ బస్సు ప్రమాదంలో 42 మంది స్కూల్‌ చిన్నారులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సును కంటెయినర్‌ లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు లారీ మంటల్లో కాలిపోయాయి.

ఇదే సమయంలో ఆ బస్సుకు సమాంతరంగా ప్రయాణిస్తున్న టి.దాసరహళ్లి నుంచి దండేలి వెళ్తున్న స్కూల్‌ బస్సులో 42 విద్యార్థులు ఉండగా, మంటలు చెలరేగిన బస్సును స్వల్పంగా తాకినా డ్రైవర్‌ అప్రమత్తతతో వెంటనే బస్సును సురక్షితంగా ముందుకు తీసుకెళ్లి పెద్ద ప్రమాదాన్ని నివారించాడు. ఈ ఘటనలో స్కూల్‌ బస్సులో ఉన్న చిన్నారులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్‌ చాకచక్యాన్ని పోలీసులు, అధికారులు ప్రశంసించారు.

Related news : కర్ణాటక బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Next Story