లిఫ్ట్​లో ఇరుక్కున తల్లి బిడ్డలను కాపాడిన కేపీహెచ్​బీ పోలీసులు..

by Kodari Anjali |

లిఫ్ట్​లో ఇరుకున్న తల్లి కొడుకులను పోలీసులు కాపాడి బయటకు తీశారు.

లిఫ్ట్​లో ఇరుక్కున తల్లి బిడ్డలను కాపాడిన కేపీహెచ్​బీ పోలీసులు..
X

దిశ, కూకట్​పల్లి: కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కేపీహెచ్​బీకాలనీ 9వ ఫేజ్​లో కొటక్​ మహీంద్ర బ్యాంక్​ భవనంలోని లిఫ్ట్​లో ఎక్కిన తల్లి కొడుకులు ఒక్క సారిగా లిఫ్ట్​ ఆగిపోవడంతో అందులోనే ఇరుకున్నారు. లిఫ్ట్​లో ఇరుకున్న మహిళ 100 నంబర్​కు కాల్​ చేసి సమాచారం అందించగా, సంఘటన స్థలానికి చేరుకున్న కేపీహెచ్​బీ పోలీసులు లిఫ్ట్​ డోర్​ను రాడ్​లు, కర్రల సహాయంతో తెరిచి లిఫ్ట్​లో ఇరుకున్న తల్లి కొడుకులను సురక్షితంగా బయటకు తీశారు. సకాలంలో స్పందించి తల్లి కొడుకులను కాపాడిన కేపీహెచ్​బీ పోలీసుల సమయస్పూర్తికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story