- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యను ప్రైవేటుపరం చేసేందుకు రేవంత్ కుట్ర: కల్వకుంట్ల కవిత
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. విద్యా కమిషన్ రిపోర్ట్ పేరుతో 27 వేల స్కూళ్లను 4 వేలకు కుదించే ప్రయత్నం జరుగుతున్నదని.. దీన్ని తెలంగాణ రక్షణ సేన మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నదని తెలిపారు...

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. విద్యా కమిషన్ రిపోర్ట్ పేరుతో 27 వేల స్కూళ్లను 4 వేలకు కుదించే ప్రయత్నం జరుగుతున్నదని.. దీన్ని తెలంగాణ రక్షణ సేన మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నదని తెలిపారు. తాజాగా యంగ్ ఇండియా ఇంట్రిగ్రేడేట్ స్కూల్స్ పేరుతో ఒక్కో స్కూల్‌కు రూ.146 కోట్లు ఖర్చు పెడుతున్నారని.. మొత్తం 72 స్కూళ్లకు సగానికి పైగా మేఘా, కేఎంవీ అనే సంస్థలకే ఇచ్చారని ఆరోపించారు. వాళ్లు 5 శాతం ఎక్సెస్ కోట్ చేయటంతో ప్రభుత్వంపై రూ.600 కోట్లకు పైగా భారం పడుతున్నదని పేర్కొన్నారు. 72 స్కూళ్ల కోసం దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని.. రెండున్నరేళ్లలో ఈ స్కూల్స్ నిర్మాణం పూర్తి అవటం సాధ్యం కాదని తెలిపారు. రెవెన్యూ డివిజన్‌లో స్కూల్ నిర్మిస్తే మళ్లీ విద్యార్థులు వెళ్లేందుకు బస్సులు పెట్టాలని.. ఆ బస్సులను కూడా మీరు మేఘా సంస్థకే ఇస్తారని స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు. మొత్తంగా తెలంగాణ గ్రామాల్లోకి రెడ్ కార్పేట్ వేసి ప్రైవేట్ స్కూళ్లను ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. టెండర్లలో జరిగిన గోల్‌మాల్‌పై సీఎం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.






