కోయంబత్తూరు గ్యాంగ్ రేప్.. ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్స్

by Muthe.Rajitha |   (  Updated:2025-11-06 10:33:37  IST  )

ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ పీజీ స్టూడెంట్ పై అర్థరాత్రి గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే.

కోయంబత్తూరు గ్యాంగ్ రేప్.. ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ పీజీ స్టూడెంట్ పై అర్థరాత్రి గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై DMK మిత్రపక్ష MLA ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక యువతి యువకుడు అర్థరాత్రి అలా తిరుగుతుంటే గ్యాంగ్ రేపులే జరుగుతాయని అన్నారు. అలాంటి ఆపదలను దేవుడు కూడా ఆపలేరని, ఇక పోలీసులు, తాము ఏం చేయగలమని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల పెంపకం సరిగా ఉంటే.. ఇలా పిల్లలు రోడ్ల మీద తిరగరని, టీచర్లు సంస్కారం నేర్పించకపోతే యువత ఇలా బలి కావాల్సిందేనని కామెంట్స్ చేశారు.

ఈశ్వరన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాట తీవ్ర దుమారం రేగుతోంది. బాధితులను అవమానించేలా ఎమ్మెల్యే మాట్లాడారని మహిళా సంఘాలు మండిపడుతుండగా.. నిందితులను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత అన్నామలై విమర్శించారు. కాగా గత ఆదివారం రాత్రి ప్రియునితో కలిసి కారులో లాంగ్ డ్రైవ్ కి వెళ్లిన పీజీ విద్యార్థిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తోంది.

Read More... కంచి ఆలయంలో విగ్రహాల పనుల్లో గోల్‌మాల్‌

Next Story