- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంచి ఆలయంలో విగ్రహాల పనుల్లో గోల్‌మాల్
కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారం, వెండి బల్లుల విగ్రహాల పనుల్లో గోల్ మాల్ జరిగింది. వందల ఏళ్ల నాటి పాత బంగారం అపహరణకు గురైంది. పాత విగ్రహాల స్థానంలో బంగారం పూతపూసిన విగ్రహాలను ఏర్పాటు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారం, వెండి బల్లుల విగ్రహాల పనుల్లో గోల్ మాల్ జరిగింది. వందల ఏళ్ల నాటి పాత బంగారం అపహరణకు గురైంది. పాత విగ్రహాల స్థానంలో బంగారం పూతపూసిన విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఏళ్ల నుంచి భక్తులు తాకడంతో బంగారం, వెండి బల్లులు విగ్రహాలు కొంత అరిగిపోయాయి. దీంతో ఆరు నెలల క్రితం ఆలయ అధికారులు మరమ్మత్తులను చేపట్టారు. తొలిసారి ఆలయంలోని విగ్రహాలకు మరమ్మత్తులు చేపట్టారు.
అయితే మరమ్మత్తుల సమయంలో పాత బంగారాన్ని మాయం చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. పాత విగ్రహాల స్థానంలో బంగారం పూత పూసిన విగ్రహాలను ఏర్పాటు చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఘటనపై దేవదాయ శాఖ విచారణకు ఆదేశించింది. ఆలయ అర్చకులను పురావస్తు శాఖ కమిటీ ఇప్పటికే విచారించింది. ప్రస్తుతం డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తైతే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.






