- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తరాఖండ్‌లో దారుణం.. మైనర్ బాలికను గన్‌తో బెదిరించి అత్యాచారం
ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. చంపావత్ జిల్లాలో స్నేహితులతో కలిసి ఓ వివాహానికి హాజరైన 16ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. చంపావత్ జిల్లాలో స్నేహితులతో కలిసి ఓ వివాహానికి హాజరైన 16ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బీజేపీ నాయకుడు, మరో ముగ్గురు కలిసి బాధితురాలికి కత్తి చూపించి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానిక బీజేపీ నాయకుడు పూరన్ సింగ్ రావత్, వినోద్ సింగ్ రావత్, నవీన్ సింగ్ తో పాటు మరో యువకుడు బాలికను బెదిరించి అగాయిత్యానికి పాల్పడ్డారు. బాలికను మంచానికి తాళ్లతో కట్టేసి కదలకుండా చేసి అత్యంత దారుణంగా ఆమెపై లైంగికదాడి చేశారు.
బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడుగా ఉన్న పూరన్ సింగ్ మొన్నటి వరకు బీజేపీ మండల అధ్యక్షుడి పదవిలో ఉండగా ఇటీవలే కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దారుణానికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి. దీంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.






