- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్తి పంపకాల్లో వివాదం.. అత్తను హతమార్చే యత్నం
by Batti.Sumithra |
ఆస్తి పంపకాల వివాదంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో అత్తను హతమార్చేందుకు యత్నించిన ఇద్దరు కోడళ్లను కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

X
దిశ, దోమకొండ : ఆస్తి పంపకాల వివాదంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో అత్తను హతమార్చేందుకు యత్నించిన ఇద్దరు కోడళ్లను కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన కట్ట లక్ష్మి (65) అనే వృద్ధ మహిళను ఆమె కోడళ్లు లారిక, పవిత్ర కలిసి చీర పల్లుతో ఉరివేసి హతమార్చే యత్నం చేశారు. అయితే వృద్ధురాలు అరుపులు, కేకలు వేయడంతో ఈ పెనుగులాటలో గాజులు పగిలిపోయాయి. మెడకు బిగించిన ఉరిని విప్పుకుని బయటపడిన ఆమెను, ఇరుగు పొరుగు వారు వచ్చి రక్షించారు. దీంతో వృద్ధురాలు ప్రాణాపాయం నుంచి బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు, ఇద్దరు కోడళ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు.
Next Story






