- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెట్రోస్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం.. పలువురికి గాయాలు
దేశ రాజధాని ఢిల్లీలోని రిథాల మెట్రోస్టేషన్ సమీపంలోని మురికివాడ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని రిథాల మెట్రోస్టేషన్ సమీపంలోని మురికివాడ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఒక చిన్నారి సహా పలువురికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగి గుడిసెలన్నీ దగ్ధమైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ అలుముకోవడంతో బాధితులకు ఎటువెళ్లాలో అర్థం కాలేదు. శుక్రవారం రాత్రి బెంగాలీ బస్తీలోని గుడిసెలలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు 29 ఫైరింజన్లు తీవ్రంగా శ్రమించాయి. అగ్నిప్రమాదాన్ని అంచనా వేసిన అధికారులు.. మీడియం కేటగిరకి చెందినదిగా ప్రకటించారు.
Read More..
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ఇన్నోవా.. స్పాట్ లో 8మంది
Next Story






