నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ఇన్నోవా.. స్పాట్ లో 8మంది

by Naga Rani Yarlagadda |

నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ఇన్నోవా.. స్పాట్ లో 8మంది
X

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై వెళ్తున్న ఇన్నోవా.. అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ఉండగా.. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం ధాటికి ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో ఇన్నోవా పూర్తిగా దగ్ధమైంది. హైవేపై అడ్డంగా వాహనం బోల్తా పడటంతో హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని పక్కకు తీసి.. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story