కేరళ సీఎం అభ్యర్థి ఎంపికపై బిగ్ సస్పెన్స్.. రంగంలోకి దిగిన హేమాహేమీలు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-11 08:16:26  IST  )

కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది.

కేరళ సీఎం అభ్యర్థి ఎంపికపై బిగ్ సస్పెన్స్.. రంగంలోకి దిగిన హేమాహేమీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సంబంధించిన అంశంపై ఏఐసీసీ (AICC) హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హైకమాండ్ ఆదేశాల మేరకు వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల వంటి కీలక నేతలు రంగంలోకి దిగారు. రాబోయే ఎన్నికలు, ప్రస్తుత పార్టీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కేరళ కాంగ్రెస్ (UDF) నాయకత్వంలో సమన్వయం సాధించేందుకు ఢిల్లీ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సిట్టింగ్ లీడర్లు, సీనియర్ల మధ్య విభేదాలు రాకుండా చూడాలని హైకమాండ్ భావిస్తోంది.

రేసులో కీలక నేతలు..

అయితే, కేరళ ముఖ్యమంత్రి కేసులో ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్ (V.D. Satheesan) తన వాగ్ధాటితో విజయన్ ప్రభుత్వంపై గళమత్తారు. పార్టీలోని అన్ని వర్గాల ప్రజలకు ఆయనకు సంబంధాలు ఉండటంతో ఆయన సీఎం రేసులో ముందున్నారు. ఇక ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్‌కు హైకమాండ్ వద్ద మంచి పట్టు ఉంది. అదేవిధంగా పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న చెన్నితాల రమేశ్ అనుభవాన్ని పార్టీ వినియోగించుకోవాలని చూస్తోంది. దీంతో రాష్ట్ర నాయకత్వంలో సీఎంగా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే దానిపై కార్యకర్తల అభిప్రాయాలను కూడా హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంటున్నారు.

బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయాలు

Next Story