Lok Sabha: లోక్‌సభలో విపక్షాల ఆందోళన.. మహిళా రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్‌పై రచ్చ

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-17 06:30:01  IST  )

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ కొనసాగుతుండగానే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి.

Lok Sabha: లోక్‌సభలో విపక్షాల ఆందోళన.. మహిళా రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్‌పై రచ్చ
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ (Lok Sabha)లో మహిళా రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతున్న వేళ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం హడావుడిగా గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) విడుదల చేయడాన్ని విపక్ష ఎంపీలు తీవ్రంగా ఖండించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో ఇంకా పూర్తిస్థాయి చర్చ జరుగుతుండగానే, బయట గెజిట్ నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని, సభలో చర్చకు విలువే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ విపక్ష ఎంపీలు సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు.

నిరసనల మధ్యే కొనసాగుతున్న చర్చ..

విపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసనలు తెలుపుతున్నప్పటికీ, స్పీకర్ ఓం బిర్లా సభను కొనసాగించారు. విపక్షాల నినాదాల నడుమే మహిళా రిజర్వేషన్లపై చర్చ సాగుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా ఉందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే ఈ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించాల్సిన సమయంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం

Next Story