- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం, ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర సర్కార్ అమల్లోకి తీసుకువచ్చింది. చట్ట సభల్లో మహిళలకు 33% కోటాను కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం నిన్నటి నుంచే అమలులోకి వస్తుందని ప్రకటన చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 16ను చట్టం అమలు తేదీగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. 2029 ఎన్నికల్లో అమలు చేసేందుకు సంబంధించి ఇదే చట్టాన్ని సవరించాలని పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలోనే నోటిఫై చేసింది.
సాంకేతిక కారణాల వల్లే, ఇలా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తదుపరి జనగణన తర్వాత చేపట్టే డీలిమిటేషన్ ఆధారంగా మహిళలకు రిజర్వేషన్లు అమలు అవుతాయని ఇందులో స్పష్టంగా పేర్కొంది కేంద్రం. అంతకు మించి ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయడంపై వివరాలను ఇంకా ఎక్కడ వెల్లడించలేదు. అయితే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన పద్ధతిపై కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ అవుతున్నారు.
ఇది ఇలా ఉండగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డీలిమిటేషన్ బిల్లుపై ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అటు బిల్లు ఆమోదం పొందడానికి కావలసిన 360 ఓట్లు కూడగట్టేందుకు అధికార ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తోంది.






