ప్రధాని మోడీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. ‘ఉగ్రవాది’ అని.. ఆపై వివరణ!

by Ramesh Naini |   (  Updated:2026-04-21 12:40:41  IST  )

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రధాని మోడీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. ‘ఉగ్రవాది’ అని.. ఆపై వివరణ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా చెన్నైలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో ఆయన ప్రధాని మోదీని ‘ఉగ్రవాది’తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమానత్వ సిద్ధాంతాలను నమ్మని ప్రధాని, దక్షిణాది రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు అలాంటి వారితో అన్నాడీఎంకే పొత్తు ఎలా పెట్టుకుందని ప్రశ్నించారు. అన్నాడీఎంకే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని, పెరియార్, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేస్తోందని విమర్శించారు.

వెంటనే వివరణ ఇచ్చుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు

అయితే, తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఖర్గే వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. తాను మోడీని ‘ఉగ్రవాది’ అనలేదని, ఆయన ప్రజలను ‘భయభ్రాంతులకు గురిచేస్తున్నారని’ (టెర్రరైజింగ్) మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. ‘ప్రధాని మోదీ ఎప్పుడూ బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన ప్రజలను భయపెడుతున్నారు అని చెప్పానే తప్ప, ఉగ్రవాది అని నేను ఎప్పుడూ అనలేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

తలకిందులుగా వేలాడదీసి, బుద్ధి చెబుతాం : టీఎంసీ నేతలకు అమిత్‌ షా తీవ్ర హెచ్చరిక

Next Story